PM Modi in Ujjain Mahankali Temple: సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు (వీడియో)

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

Modi in Ujjain Mahankali Temple (Credits: X)

Hyderabad, Mar 5: తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) మంగళవారం సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని (Ujjain Mahankali Temple) దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అర్చకులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారి దర్శనం తర్వాత సంగారెడ్డి పర్యటనకు మోదీ బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వెళ్లారు.

Hyderabad Horror: మానవత్వమా? నువ్వెక్కడ? దేశాన్ని కాపాడే జవాన్ రోడ్డుపై తీవ్రగాయాలతో పడిఉన్నా పట్టించుకోని ప్రజలు.. హైదరాబాద్ నార్సింగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై హిట్‌ అండ్‌ రన్‌.. ప్రాణాలు వదిలిన జవాన్ కులాన్‌ (వీడియో)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement