Viral Andhra Police Video: పెన్సిల్ పోయిందని పోలీస్ గడప తొక్కిన బుడతడు, సార్ పెన్సిల్ తిరిగి ఇచ్చాను అని చెప్పిన మరో బుడతడు, వైరల్‌గా మారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ట్వీట్ వీడియో

తాను హోంవర్క్ చేస్తుంటే తన పెన్సిల్ దొంగిలించాడని పోలీస్‌ స్టేషన్ మెట్లెక్కాడు ఓ బుడతడు. కర్నూలు జిల్లా కడుబూరులో జరిగింది ఈ ఘటన. హ‌న్మంత్ అనే విద్యార్థి పెన్సిల్‌ను మ‌రో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హ‌న్మంత్ స్థానిక పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి పెన్సిల్ దొంగ‌త‌నంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

Primary School Student Goes To Andhra Police Station (Photo-Video Grab)

తాను హోంవర్క్ చేస్తుంటే తన పెన్సిల్ దొంగిలించాడని పోలీస్‌ స్టేషన్ మెట్లెక్కాడు ఓ బుడతడు. కర్నూలు జిల్లా కడుబూరులో జరిగింది ఈ ఘటన. హ‌న్మంత్ అనే విద్యార్థి పెన్సిల్‌ను మ‌రో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హ‌న్మంత్ స్థానిక పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి పెన్సిల్ దొంగ‌త‌నంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ప్రతి రోజు పెన్సిల్స్ దొంగ‌త‌నం చేస్తున్నాడు. పైస‌లు కూడా తీసుకుపోతున్నాడు. రోజు ఇదే ప‌ని అని హ‌న్మంత్ పోలీసుల‌కు చెప్పాడు. ఈ ఒక్‌సారి కేసు పెట్టండి అని కోరాడు. అయితే… సార్ పెన్సిల్ తిరిగి ఇచ్చాను అని మ‌రో అబ్బాయి సంజాయిషీ ఇచ్చుకున్నప్పటికీ.. హ‌న్మంత్ మాత్రం విన‌లేదు. ఇద్దరు పిల్లలకు సర్ధిచెప్పి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement