Punjab Horror: పంజాబ్ లో కాంగ్రెస్ నేత కాల్చివేత.. ఇంటికి వెళ్లి మరీ తుపాకులతో కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు.. తామే చంపేశామన్న ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ
పంజాబ్ లోని మోగా జిల్లాలో నిన్న ఓ స్థానిక కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బల్జీందర్ సింగ్ బల్లీ ఇంట్లోకి ప్రవేశించి ఆయనను కాల్చి చంపారు.
Newdelhi, Sep 19: పంజాబ్ (Punjab) లోని మోగా జిల్లాలో నిన్న ఓ స్థానిక కాంగ్రెస్ నేత (Congress Leader) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బల్జీందర్ సింగ్ బల్లీ ఇంట్లోకి ప్రవేశించి ఆయనను కాల్చి చంపారు. డాలా గ్రామంలోని బల్జీందర్ ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డైంది. బల్జీందర్ అజిత్వాల్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత కెనడాకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) అర్ష్ దల్లా స్పందించాడు. బల్జీందర్‌ను హతమార్చింది తామేనని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. బల్జీందర్ తన జీవితాన్ని నాశనం చేశాడని, గ్యాంగ్‌స్టర్ కల్చర్‌లోకి తనను బలవంతంగా నెట్టేశాడని ఆరోపించాడు. తన తల్లి పోలీసు కస్టడీ వెనక అతడి హస్తం ఉందని, ప్రతీకారంగానే అతడిని హత్య చేసినట్టు తెలిపాడు.