Viral Video: వీడియో ఇదిగో, ప్రియురాలి ఉద్యోగం కోసం అమ్మాయిగా మారిన ప్రియుడు, బయోమెట్రిక్ డివైస్ దగ్గర దొరికిపోవడంతో బండారం బయటకు..
చిక్కుల్ని కొని తెచ్చుకున్నాడు. నవరి 7వ తేదీన బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం పరీక్ష నిర్వహించింది
Punjab Man Dressed As His Girlfriend To Write Exam: పంజాబ్ రాష్ట్రంలో ఓ యువకుడు ప్రేయసి కోసం ఎవరూ చేయలేని సాహసమే చేసి.. చిక్కుల్ని కొని తెచ్చుకున్నాడు. నవరి 7వ తేదీన బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం పరీక్ష నిర్వహించింది. ఫజిల్కా ప్రాంతానికి చెందిన అంగ్రేజ్ సింగ్ అనే యువకుడు.. తన ప్రేయసి పరంజిత్ కౌర్ బదులు ఆ పరీక్ష రాయాలకున్నాడు. అమ్మాయిల వస్త్రధారణతో పరీక్ష హాల్‌కు వెళ్లాడు.
లేడీస్ సూట్ వేసుకుని, ఎరుపురంగు గాజలు ధరించి, నుదుట తిలకం పెట్టుకుని, పెదాలకు లిప్‌స్టిక్ రాసుకుని అచ్చం అమ్మాయిలా తయారై వచ్చేసరికి ఎవరూ గుర్తించలేకపోయారు. పరీక్ష మొదలైంది. అమ్మాయి వేషధారణలో దిగిన ఫొటోతో తన గర్ల్‌ఫ్రెండ్ పరంజీత్ కౌర్ పేరిట తయారు చేయించుకున్న నకిలీ గుర్తింపు కార్డులను కూడా అధికారులు పసిగట్టలేకపోయారు.
ఇన్విజిలేటర్ ఒక్కొక్కరి దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటూ అంగ్రేజ్ సింగ్ దగ్గరకు వచ్చాడు. అంగ్రేజ్ సింగ్ వేలిముద్రలు అసలు క్యాండిడేట్ పరంజీత్ కౌర్ వేలిముద్రలు వేరు కావడంతో సరిపోలలేదు.దాంతో అనుమానం వచ్చి తనిఖీ చేయడంతో తను అమ్మాయి వేషంలో వచ్చిన అబ్బాయి అని తేలింది. అది చూసి ఆ హాల్లో పరీక్ష రాస్తున్న మిగతా అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్‌లు, అధికారులు నవ్వాపుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంగ్రేజ్‌ను పోలీసులకు అప్పగించారు. పరంజీత్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు.అక్కడితో ఆగకుండా అతనిపై చట్టపరమైన చర్యలకు యూనివర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు.
Here's Pics
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)