PhD Sabziwala: పీహెచ్‌ డీ, 4 పీజీలు.. అయినా కూరగాయలు అమ్ముకుంటున్న పంజాబీ వ్యక్తి.. ఎందుకు??

ఇందులో వింతేముంది? అంటారా?? సందీప్‌ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్‌డీ అందుకున్నారు.

PhD Sabziwala (Credits: X)

Newdelhi, Jan 2: పంజాబ్ (Punjab) కు చెందిన 39 ఏండ్ల సందీప్‌ సింగ్‌ వీధిలో కూరగాయలు (Vegetables) అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో వింతేముంది? అంటారా?? సందీప్‌ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్‌ డీ (PhD) అందుకున్నారు మరి. సరైన ఉద్యోగం దొరక్కపోవడం, చేస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి వేతనం సరిగ్గా అందకపోవడంతో ఇలా సబ్జీవాలా అవతారమెత్తి ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నాడు సందీప్‌. తన కూరగాయల బండికి ‘పీహెచ్‌డీ సబ్జీవాలా’ అనే బోర్డ్‌ కూడా తగిలించాడు అతను. కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్‌గా కన్నా.. కూరగాయలు అమ్ముతూ ఎక్కువ సంపాదిస్తున్నానని అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల వైరల్‌గా మారాయి.

Eggs-Chicken Price Rise: తెలంగాణలో పెరుగుతున్న కోడి గుడ్లు, చికెన్ ధరలు.. కోడి గుడ్డు ధర రూ.7కు, కిలో చికెన్ ధర రూ.240కి చేరిక.. కార్తీకమాసం ముగియడంతో పెరిగిన వినియోగం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)