Viral Video: వీడియో ఇదిగో, రైలు వేగంగా వస్తున్నా లెక్కచేయలేదు, పట్టాల మధ్యలో పడిపోయిన వృద్ధుడిని కాపాడిన పోలీస్
గమనించిన ప్రభుత్వ రైల్వే పోలీస్ తన ప్రాణాలు పణంగా పెట్టి ఆ వృద్ధుడ్ని కాపాడాడు. (GRP Saves Elderly Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో స్టేషన్‌లోకి రైలు వస్తుండగా ఒక వృద్ధుడు రైలు పట్టాల మధ్యలో పడిపోయాడు. గమనించిన ప్రభుత్వ రైల్వే పోలీస్ తన ప్రాణాలు పణంగా పెట్టి ఆ వృద్ధుడ్ని కాపాడాడు. (GRP Saves Elderly Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో సూరత్-బాంద్రా టెర్మినల్ ఇంటర్‌సిటీ రైలు వాపి స్టేషన్‌లోకి వస్తున్నది. ఇంతలో రైలు పట్టాలు దాటేందుకు ఒక వృద్ధుడు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అదుపుతప్పి రైలు పట్టాల మధ్యలో పడిపోయాడు. పైకి లేవలేక పోయాడు.
ఇది గమనించిన పోలీస్.. రైలు కొన్ని మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తన ప్రాణాలు లెక్కచేయక పట్టాల మధ్యలో పడి ఉన్న వృద్ధుడ్ని కాపాడేందుకు ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) వీర్‌భాయ్ మేరు ప్రయత్నించాడు. మరికొందరి సహాయంలో వృద్ధుడితోపాటు అతడు కూడా ప్లాట్‌ఫారమ్ పైకి చేరాడు. ఆ రైలు బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఆ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)