Viral Video: టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించిన పోలీసును మందలించిన రైల్వే అధికారి, ఇది మీ ఇల్లనుకుంటున్నారా అంటూ సూటి ప్రశ్న, వీడియో ఇదిగో..
ఇటీవలి రోజుల్లో చాలా మంది రైల్వే ప్రయాణికులు రైళ్ల దుస్థితిని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండటం, టికెట్ లేని ప్రయాణికులు సీట్లలో కూర్చోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు, ఎయిర్ కండిషన్డ్ రైలు కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు ఒక పోలీసును ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మందలించిన వీడియో వైరల్ అవుతోంది.

AC కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు TTE ఒక పోలీసును ఎదుర్కొన్నాడు" అనే శీర్షికతో రెడ్డిట్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో, రైల్వే అధికారి ఆ పోలీసును తన సీటు గురించి ప్రశ్నించినట్లు కనిపిస్తోంది.ఆ పోలీస్ టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నట్లు టీటీఈ తెలుసుకున్నాడు. దీంతో యూనిఫార్మ్ ధరించిన పోలీస్‌ను టికెట్ చూపించమని టీటీఈ అడగకూడదని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ‘కనీసం జనరల్ కోచ్ టికెట్ కూడా మీ వద్ద లేదు. కానీ ఏసీ కోచ్‌లో నిద్రపోతున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ పడుకోవడానికి ఇది మీ ఇల్లని అనుకుంటున్నారా? లేచి వెళ్లండి’ అని మండిపడ్డాడు. దీంతో ఆ పోలీస్ బెర్త్ నుంచి లేచి తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.రెడ్డిట్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Railway Official Reprimands Police For Travelling In AC Coach Without Ticket
TTE confronts a cop for travelling without ticket in the AC coach
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)