Vishwak Sen’s ‘Laila’: మీ లైలా గెటప్ కేపీహెచ్‌బీ మెట్రో కింద ఆంటీలా ఉందంటూ జర్నలిస్ట్ ప్రశ్న, ఒక్కసారిగా షాకైన విశ్వక్ సేన్, తేరుకుని ఏమన్నారంటే..
మీ లైలా గెటప్ కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందని అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దానికి విశ్వక్ బదిలిస్తూ.. ఇంటర్నేషనల్ ఫిగర్‌ను కేపీహెచ్‌బీ ఆంటీ అంటారా ఎంత అన్యాయం రా అంటూ సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
విశ్వక్ సేన్ హీరోగా, ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ఇచ్చుకుందాం బేబీ’ అంటూ సాగే పాటను గురువారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లోనే యాక్షన్ టచ్ తో ఉన్న కామెడీ సినిమా ఇది. ఇలాంటి కథతో సినిమా చేయాలని, లైలా లాంటి పాత్ర పోషించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా.ఈ అవకాశం ఇచ్చిన సాహు అన్నకు థ్యాంక్స్ అని అన్నారు.
దర్శకుడు ఓం రమేష్ కృష్ణ అదృశ్యం.. మియాపూర్‌లో నివాసం ఉంటున్న దర్శకుడు, పోలీసులకు ఫిర్యాదు
లైలా పాత్ర కోసం రెడీ అవ్వడానికి రెండు గంటలు పట్టేది. ఈ న్యూ ఏజ్ సినిమాను ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. ఫ్యామిలీతో కలిసి చూసేలా తీసిన క్లీన్ ఎంటర్‌టైనర్. ఫిబ్రవరి 1న ‘ఓహో రత్తమ్మ’ అనే రాయలసీమ మాస్ సాంగ్ విడుదల చేయనున్నాం’ అని చెప్పాడు. ఇక మీ లైలా గెటప్ కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందని అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దానికి విశ్వక్ బదిలిస్తూ.. ఇంటర్నేషనల్ ఫిగర్‌ను కేపీహెచ్‌బీ ఆంటీ అంటారా ఎంత అన్యాయం రా అంటూ సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
లైలా కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్
Laila (Official Teaser)
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)