Viral Video: ఒక్క క్షణం లేటై ఉంటే గాల్లో కలిసిపోయేవాడు, వేగంగా దూసుకువస్తున్న వందేభారత్ ముందు పట్టాలు దాటిన వృద్ధుడు, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియిలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పట్టాలు దాటి ప్లాట్‌ఫాం పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వందే భారత్ రైలు వేగంగా దూసుకొచ్చింది
వేగంగా దూసుకువచ్చిన వందేభారత్ రైలు ప్రమాదం నుంచి ఓ వ్యక్తి వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియిలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పట్టాలు దాటి ప్లాట్‌ఫాం పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వందే భారత్ రైలు వేగంగా దూసుకొచ్చింది. అదే సమయంలో అతడు క్షణాల్లోనే ప్లాట్‌ఫాంపైకి ఎక్కడంతో అదృష్టవశాత్తు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కాకపోతే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. జీవితమనేది వన్‌టైం జర్నీ. . రెండో ఛాన్స్ తీసుకునేందుకు రివైండ్ బటన్ ఏమీ ఉండదు. ట్రాక్‌ల నుంచి దూరంగా ఉండండి. సురక్షితంగా ఉండండి. బాధ్యతతో మెలగండి’’ అని ఆర్‌పీఎఫ్ పేర్కొంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)