Free Treatment: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స.. పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన కేంద్రం.. ఎక్కడ అంటే?
ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నారు.
Newdelhi, Mar 15: రోడ్డు ప్రమాద బాధితులకు (Road Accident Victims) సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకువస్తున్నది. ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స (Free Treatment) అందించనున్నారు. చండీగఢ్ లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. పైలట్ ప్రోగ్రామ్ లో వచ్చే ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా పథకాన్ని అమలుజేయనున్నారు.