Viral Video: 300 మంది ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్ లో మంటలు.. వీడియో వైరల్
విమానం టేకాఫ్ తీసుకుంటుండగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. థాయిల్యాండ్ లోని ఫుకెట్ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన.
Newdelhi, Feb 6: విమానం (plane) టేకాఫ్ (Takeoff) తీసుకుంటుండగా ఇంజిన్ (Engine) లో మంటలు చెలరేగాయి. థాయిల్యాండ్ లోని ఫుకెట్ (Phuket) విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. ఘటనకు కారణమైన విమానం రష్యాలోని అజుర్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 767 300ఈఆర్ విమానం అని, ప్రమాద సమయంలో ఫ్లైట్ లో 300 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన విమానాశ్రయ అధికారులు విమానాన్ని నిలిపేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
టర్కీ భూకంప బాధితుల సహాయానికి ఎన్డీఆర్ఎఫ్.. 4 వేలు దాటిన మృతుల సంఖ్య
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)