Gujarat Floods: వీడియో ఇదిగో, నదిలోకి కొట్టుకుపోయిన కారు, 2 గంటల పాటు కారు పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపు, భారీ వర్షాలకు గుజరాత్‌లో పొంగిపొర్లుతున్న నదులు

ఈ క్రమంలో సాబర్‌కాంఠా జిల్లాకు చెందిన సురేశ్‌ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తూ కరోల్‌ నదిని దాటేందుకు యత్నించారు. మధ్యలోకి వెళ్లగానే నీటి ఉద్ధృతి పెరిగింది.

Couple Stranded On Top Of Car in Flood Water in Gujarat, Rescued After 2 Hours Screenshot of the video (Photo Credit: X/@gaurav1307kumar)

భారీ వర్షాలకు గుజరాత్‌లో నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో సాబర్‌కాంఠా జిల్లాకు చెందిన సురేశ్‌ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తూ కరోల్‌ నదిని దాటేందుకు యత్నించారు. మధ్యలోకి వెళ్లగానే నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఆ ప్రవాహంలో 1.5 కి.మీ దూరం కొట్టుకుకుపోయిన ఆ కారు.. చివరకు ఓ చోట ఆగిపోయింది.కారు పైభాగం మాత్రమే కనిపించే స్థాయికి చేరుకుంది.

బుడమేరు’ పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్.. ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారుల హెచ్చరిక

అప్పటికే మిస్త్రీ దంపతులు అతి కష్టం మీద బయటకు వచ్చి వాహనం పైభాగానికి చేరుకున్నారు. కారు పైభాగంలో కూర్చొని తమ ఫోన్‌తోనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో వారిని బయటకు తీసుకురాలేకపోయారు. అలా దాదాపు రెండు గంటలపాటు మిస్త్రీ దంపతులు వాహనం పైభాగంలోనే కూర్చుండిపోయారు. చివరకు నీటి ప్రవాహం కాస్త తగ్గడంతో సహాయక బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)