Viral Video: 2ఏళ్ల చిన్నారిపై జిరాఫీ ఎటాక్..! షాకింగ్ వీడియో
రోడ్డుపక్కనే ఓ జిరాఫీ కనిపించడంతో దానికి ఆహారం అందించేందుకు ప్రయత్నించాడు కారులోని బుడతడు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఆ జిరాఫీ ఏకంగా చిన్నారినే చొక్కా పట్టుకుని కారులోంచి...
యానిమల్ పార్క్, జూ పార్క్, సఫారీ లాంటి ప్రదేశాలకు వెళ్లి అక్కడి జంతువులను చూడడం చాలామంది ఇష్టపడుతుంటారు. అలా వెళ్లినప్పుడు కొంతమంది పిల్లలు అక్కడి జంతువులకు ఆహారాన్ని కూడా అందిస్తూ ఆనందపడుతుంటారు. అయితే కొన్నిసార్లు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు కూడా దారి తీస్తుంది. అందుకు కచ్చితమైన ఉదాహరణ తాజాగా యూఎస్‌లో జరిగిన ఘటన.
యూఎస్ఏలోని టెక్సాస్ పరిధిలో ఉన్న గ్లెన్ రోజ్ ప్రాంతంలో ఫాసిల్ రిమ్ వైల్డ్‌లైఫ్ సెంటర్ ఉంది. ఇక్కడ ఉండే రకరకాల జంతువులను చూడడానికి రోజూ ఎంతోమంది సందర్శకులు వస్తుంటారు. కానీ తాజాగా తమ 2 ఏళ్ల చిన్నారితో కలిసి వచ్చిన ఓ జంటకి ఊహించని అనుభవం ఎదురైంది.
రోడ్డుపక్కనే ఓ జిరాఫీ కనిపించడంతో దానికి ఆహారం అందించేందుకు ప్రయత్నించాడు కారులోని చిన్నారి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఆ జిరాఫీ ఏకంగా చిన్నారినే చొక్కా పట్టుకుని కారులోంచి బయటకు ఎత్తేసింది. కొన్ని అడుగుల ఎత్తు వరకు ఎత్తి ఆ తర్వాత మళ్లీ కారులో వదిలేసింది. ఊహించని ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులతో పాటు చుట్టూ ఉన్నవారంతా షాకయ్యారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)