Accident in UP: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్ జాతీయ రహదారి -58 పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీ కొట్టింది.
Newdelhi, Nov 14: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ముజఫర్‌నగర్ (Muzaffarnagar) జాతీయ రహదారి -58 పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తున్న కారు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో (car collides with truck) ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)