Telugu States Rains: వరద బాధితులకు సోనూసూద్ సాయం, ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు, ఆంధ్రా, తెలంగాణ ప్రజలు నా కుటుంబం సార్ అంటూ బదులిచ్చిన సోనూ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు సోనూసూద్ కు ధన్యవాదాలు తెలిపారు. దానికి సోనూ సూద్ రిప్లయి ఇస్తూ.. ఆంధ్రా, తెలంగాణ ప్రజలే నా కుటుంబం సార్. మీ మార్గదర్శకత్వంలో మేము వారి జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము

Sonu Sood and Chandrababu (Photo-Facebook)

భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు విలవిలలాడాయి. ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం, వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు.ప్రముఖ నటుడు సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.  తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్, మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందిస్తామని ప్రకటన

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు సోనూసూద్ కు ధన్యవాదాలు తెలిపారు. దానికి సోనూ సూద్ రిప్లయి ఇస్తూ.. ఆంధ్రా, తెలంగాణ ప్రజలు నా కుటుంబం సార్. మీ మార్గదర్శకత్వంలో మేము వారి జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. ప్రతిదానికి టన్ను ధన్యవాదాలు సార్ అని బదులిచ్చాడు.

Here's Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement