Mahesh Babu New Look: మహేశ్ బాబు న్యూలుక్ అదిరింది అంటున్న ఫ్యాన్స్, రాజమౌళి సినిమాలో కౌబాయ్ గెటప్ కోసమేనంటూ జోరుగా చర్చ
మహేష్ బాబు న్యూలుక్‌ను చూసి ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మహేశ్, రాజమౌళి కలయికలో రూపొందనున్న చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేశ్ ఎలా కనిపించబోతున్నాడనే విషయంపై అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఘట్టమనేని హీరో కూడా ప్రస్తుతం అదే మేకోవర్‌లో వున్నాడు.
మహేష్ బాబు న్యూలుక్‌ను చూసి ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మహేశ్, రాజమౌళి కలయికలో రూపొందనున్న చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేశ్ ఎలా కనిపించబోతున్నాడనే విషయంపై అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఘట్టమనేని హీరో కూడా ప్రస్తుతం అదే మేకోవర్‌లో వున్నాడు.
అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇండియానా జోన్స్ నేపథ్యంలో వుంటుందని ఇటీవల రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మహేశ్ లుక్‌పై రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. అయితే మహేశ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల కోసం రూ. 50 లక్షలు, ఏఎంబీ సినిమాస్ తరపున మరో రూ. 10 లక్షల విరాళం అందజేశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో ఆయనను కలిసి చెక్‌ను అందజేశారు.
వీడియో ఇదిగో, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు దంపతులు, సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం అందజేత
ఈ సందర్భంగా మహేశ్ తో పాటు ఆయన సతీమణి నమ్రత కూడా వున్నారు. మహేశ్, రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో లాంగ్ హెయిర్, గడ్డం, వైట్ ఫుల్‌హ్యాండ్ టీషర్ట్‌లో కనిపిస్తున్న మహేశ్ బాబును చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ హీరో రాజమౌళి సినిమాలో ఇదే లుక్‌లో కనిపించబోతున్నాడని చర్చించుకుంటున్నారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)