Tamil Nadu: స్కూలు బస్సులోనే మద్యం దుకాణం పెట్టిన విద్యార్థులు, బీరు తాగుతూ చిందేస్తున్న వీడియో వైరల్, ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపిన తమిళనాడు అధికారులు

తమిళనాడు రాష్ట్రంలో కదులుతున్న బస్‌లో పాఠశాల విద్యార్థులు మద్యం సేవిస్తున్న వీడియో (school students drinking alcohol in bus ) ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో జరిగినట్లు గుర్తించారు.

school students drinking alcohol in bus Video goes viral

తమిళనాడు రాష్ట్రంలో కదులుతున్న బస్‌లో పాఠశాల విద్యార్థులు మద్యం సేవిస్తున్న వీడియో (school students drinking alcohol in bus ) ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో జరిగినట్లు గుర్తించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు యూనిఫామ్‌ ధరించి బస్‌లో ప్రయాణిస్తున్నారు. వీరిలో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి బీర్‌ బాటిల్‌ను ఓపెన్‌ చేసి తాగుతూ కనిపించారు. ఈ తంతంగాన్నంతా తోటి విద్యార్థులు రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

చెంగల్‌పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు తిరుకజుకుండ్రం నుంచి తాచూర్‌కు వెళుతుండగా వీరు మద్యం తాగినట్లు తెలుస్తోంది. విద్యార్థులు బస్‌లో మద్యం సేవిస్తున్న విషయం చివరికి అధికారులు దృష్టికి వెళ్లడంతో.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement