Tamil Nadu Shocker: షాకింగ్ వీడియో, ట్రాన్స్‌జెండర్ల జుట్టు కత్తిరించి వారిని సూటి పోటీ మాటలతో వేధించిన ఇద్దర వ్యక్తులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌జెండర్ల పట్ల ఇద్దరు వ్యక్తులు మానవత్వం మరిచి ప్రవర్తించారు.ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను వేధించడమే కాకుండా.. వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు.
తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌జెండర్ల పట్ల ఇద్దరు వ్యక్తులు మానవత్వం మరిచి ప్రవర్తించారు.ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను వేధించడమే కాకుండా.. వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఓ ట్రాన్స్‌జెండర్ పొడవాటి జుట్టును బలవంతంగా రేజర్‌తో కత్తిరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త గ్రేస్ బాను ట్విటర్‌లో షేర్ చేశారు.
19 సెంకడ్ల నిడివి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బాధిత ట్రాన్స్‌జెండర్లను, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను గుర్తించామని.. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తూత్తుకుడి ఎస్పీ బాలాజీ తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)