Infosys Salary Hike 2025: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్, ఫిబ్రవరి నుంచి వేతనాల పెంపు, ముందుగా జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు హైక్
ఇన్ఫోసిస్ త్వరలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశముందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వేతనాల పెంపును ఫిబ్రవరి నుంచి క్రమంగా అమలు చేయనుందని తెలుస్తోంది. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు అందుతుందని తెలుస్తోంది.
ఇన్ఫోసిస్ త్వరలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశముందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వేతనాల పెంపును ఫిబ్రవరి నుంచి క్రమంగా అమలు చేయనుందని తెలుస్తోంది. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు అందుతుందని తెలుస్తోంది. వీరికి ఫిబ్రవరిలో సంబంధిత లెటర్స్ అందించనున్నారు. జనవరి 1 నుంచే వేతనాల పెంపు అమల్లోకి రానుందని సమాచారం. జేఎల్5లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సీనియర్ ఇంజినీర్లు, సిస్టం ఇంజినీర్లు, కన్సల్టెంట్లు ఉంటారు. జాబ్ లెవల్ 6 ఆపై ఉన్న వారికి మార్చిలో వేతనాల పెంపుకు సంబంధించిన లేఖలు అందనున్నాయని తెలుస్తోంది. అయితే వేతనాల పెంపుకు సంబంధించి కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వచ్చే ఏడాది నాటికి 46 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపిన టీసీఎస్
Infosys likely to start rolling out pay hike letters in February
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)