Telangana Army Jawan: లడఖ్‌ లో ఇటీవల ట్రక్కు లోయలో పడి అమరులైన వారిలో తెలంగాణ జవాన్.. రంగారెడ్డి జిల్లా తిర్మన్‌దేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ గా గుర్తింపు

జమ్మూకశ్మీర్‌లోని లఢఖ్‌ లో శనివారం ఓ ఆర్మీట్రక్కు లోయలో పడి 9 మంది జవాన్లు అమరులయ్యారు. అమరులైన జాబితాలో తెలంగాణ వాసి కూడా ఉన్నట్టు తాజాగా వెల్లడైంది.

Credits: X

Newdelhi, Aug 21: జమ్మూకశ్మీర్‌లోని (Jammukashmir) లఢఖ్‌ (Ladakh) లో శనివారం ఓ ఆర్మీట్రక్కు (Army Truck) లోయలో పడి 9 మంది జవాన్లు అమరులయ్యారు. అమరులైన జాబితాలో తెలంగాణ వాసి కూడా ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తంగళ్లపల్లి పంచాయతీ పరిధిలోని తిర్మన్‌ దేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ (29) ఈ ప్రమాదంలో అమరులయ్యారు. చంద్రశేఖర్ 2010లో ఆర్మీలో చేశారు. 2017లో కక్లూరుకు చెందిన లాస్యను వివాహం చేసుకున్నారు. వీరికి వర్షిత్ (4) అనే బాబు, సహస్ర అనే రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ ఏడాది మార్చి 17న గ్రామానికి వచ్చిన చంద్రశేఖర్ సెలవుల అనంతరం ఏప్రిల్‌ లో తిరిగి వెళ్లారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement