KTR Viral Video: సాధారణ పౌరుడిలా పాతబస్తీలోని షాదాబ్ హోటల్ కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసిన కేటీఆర్.. గుర్తుపట్టి షాకైన జనం.. ఆ తర్వాత ఏమైంది?? వీడియో ఇదిగో..
ఇటీవల నిలోఫర్ కేఫ్ లో సందడి చేసిన కేటీఆర్.. గతరాత్రి షాబాద్ హోటల్‌కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Hyderabad, Nov 18: తెలంగాణలో (Telangana) మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ మంత్రి కేటీఆర్ (KTR) వీలైనంతగా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నిలోఫర్ కేఫ్ లో సందడి చేసిన కేటీఆర్.. గతరాత్రి షాబాద్ హోటల్ కి (Shabad Hotel) వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాతబస్తీలోని మదీనా చౌరస్తా వద్దకు ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. తొలుత ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు. ఆ తర్వాత తమతో ఉన్నది మంత్రి కేటీఆర్ గుర్తించి అవాక్కయ్యారు. ఆ వెంటనే హోటల్ సందడిగా మారిపోయింది. ఆయనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. మంత్రి అనంతరం అక్కడి నుంచి మొజంజాహి మార్కెట్‌కు వెళ్లి ఐస్‌క్రీం రుచి చూశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)