Newdelhi, Nov 18: ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final)కు చేరింది. ఆదివారం అహ్మదాబాద్ ( Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య మధ్యాహ్నం 2 గంటలకు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫైనల్స్ కావడంతో క్రికెట్ అభిమానులే కాదు.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే ఈ పోరును వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మోదీతో పాటూ క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవుతారని సమాచారం.
వాయుసేన విన్యాసాలు
ఇక ఫైనల్ మ్యాచ్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. అహ్మదాబాద్ వేదికగా జరనున్న ప్రపంచకప్ ముంగిట భారత వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు (Air Show) చేయబోతోంది. ఈ విషయాన్ని గుజరాత్ కు చెందిన డిఫెన్స్ పీఆర్వో గురువారం ఒక ప్రకటనలో ధృవీకరించారు. ఫైనల్ పోరు మొదలయ్యే పది నిమిషాల ముందు స్టేడియంలో ఈ విన్యాసాలు అభిమానులను అలరించనున్నాయి. మొత్తం తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్ లు రకరకాల ఆకారాలతో అబ్బురపరుచనున్నాయి. ఇందుకోసం నేడు ఎయిర్‌షో రిహార్సల్స్ ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ లో మరో ప్రత్యేక కార్యక్రమం కూడా ఉన్నట్లు తెలస్తోంది. గోల్బల్ పాప్ సింగర్ దువా లిపా (Dua Lipa) ఫైనల్ క్లాష్ కు ముందు ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌లో పోస్ట్ లో తెలిపింది.
అప్పుడు ఓటమి
ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుంది. భారత్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్లో తలపడనుండటం ఇది రెండోసారి. 2003 తుదిపోరులో ఆసీస్ చేతిలో భారత్ ఓడింది. ఇక ఈ ప్రపంచకప్ లో టీమ్ ఇండియా మంచి ఫామ్ లో ఉంది. ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలిచింది. ఈ సారి కప్పు కొట్టాలన్న కసితో ఫైనల్స్ కు సిద్ధమవుతోంది.
Amazon Layoffs: అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్