Newdelhi, Nov 18: వాడకంలో లేని యూపీఐ ఐడీలు (UPI ID), నంబర్లను డీయాక్టివ్ (Deactivate) చేయాలంటూ గూగుల్ పే (GooglePay), పేటీఎం (Paytm), ఫోన్ పే (PhonePe) తదితర పేమెంట్ యాప్స్, బ్యాంక్ లను.. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ఆదేశించింది. ఒక ఏడాదికాలంగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగని యూపీఐ యాప్ లు, యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్లను ప్రొవైడర్లు గుర్తించి, ఆ కస్టమర్ ఐడీలను, నంబర్లను డీయాక్టివేట్ చేయాలని ఎన్‌పీసీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. 2023 డిసెంబర్ 31 నాటికల్లా ఈ మార్గదర్శకాల్ని అమలు చేయాలంటూ థర్డ్‌పార్టీ యాప్ ప్రొవైడర్లు (టీపీఏపీ), పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (పీఎస్‌పీ) బ్యాంకుల్ని కోరింది.
Have an inactive UPI ID? It will be deactivated by December 31, 2023 by payment apps – check details – Times of India https://t.co/sswkiEj7HQ
— Qadeer Abbas (@QadeerA25536548) November 17, 2023
ఎందుకు ఈ నిర్ణయం??
ఖాతాదారులు మొబైల్ ఫోన్ నంబర్లను మార్చుకున్నపుడు వారి ఖాతాల నుంచి వారికి సంబంధం లేని ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యే ప్రమాదం ఉన్నందున ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. పలువురు కస్టమర్లు కొత్త మొబైల్ నంబర్ ను తీసుకున్నప్పటికీ, పాత నంబరును బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తొలగించకపోవడం, పాత నంబరును మరొకరికి టెలికం ఆపరేటరు జారీచేయడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ఎన్‌పీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.