Hyderabad, NOV 17: విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ కొట్టిండు మనం కూడా కొడుదామా..? షమీ (Shami) హ్యాట్రిక్ తీసిండు.. మనం కూడా హ్యాట్రిక్ కొడుదామా..? వంద శాతం కొడుదామా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు మద్దతుగా ప్రసంగించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ (Azharuddin) ప్రచారానికి వస్తే క్రికెట్ ఆడండి. పిల్లలతో గల్లీలో జబర్దస్త్ క్రికెట్ ఆడించండి. కానీ ఓట్లు మాత్రం మాగంటి గోపీనాథ్‌కు వేయండి. కరోనా సమయంలో బయటకు రావడానికి మీరంతా భయపడ్డారు. కానీ గోపీనాథ్ గల్లీ గల్లీ తిరిగి పేదవారికి అండగా నిలబడ్డారు. రహ్మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ అలా ప్రతి డివిజన్‌లో, ప్రతి కాలనీలో సమస్యలు తెలిసిన వాడు మాగంటి గోపినాథ్ అని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.
Make children Play cricket with Congress candidate Azharuddin if he comes but vote for BRS candidate Gopinath - KTR
Even I am Azharuddin fan, he is great cricketer but not a great politician
Big sport stars and cinema stars won’t get your work done
Was Azharuddin ever seen in… pic.twitter.com/fS1gg1uXAJ
— Naveena (@TheNaveena) November 17, 2023
అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ గల్లీ తెలియదు. ఏ మనిషి తెలియడు. అజారుద్దీన్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి తన్ని తరిమేశారు. యూపీలో చెల్లని అజారుద్దీన్ హైదరాబాద్‌లో ఎలా చెల్లుతారు. కాంగ్రెస్ నాయకులకు పదవుల మీద ఉన్న మోజు తెలంగాణ ప్రజల మీద లేదు. కాంగ్రెస్ పార్టీలో 11 మంది సీఎం క్యాండిడేట్‌లు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే కల్లోలం, కాంగ్రెస్ అంటేనే అధికారం కోసం ఆరాటం.
కాంగ్రెస్ పార్టీ మెట్రో రైలు ఎందుకు పూర్తి చేయలేక పోయింది. హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కళ్లుండి చూడలేక పోతున్నారు. అధికారంలోకి రాగానే 18 యేళ్లు నిండిన ఆడబిడ్డలకు 3 వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం’ అని కేటీఆర్ తెలిపారు.
కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ దివంగత నేత పి.జనార్ధన్‌రెడ్డి కొడుకు విష్ణు బీఆర్‌ఎస్‌లో చేరి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది.