Pulse Polio Vaccination Drive: నేడు పల్స్ పోలియో.. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చుక్కల కార్యక్రమం.. రేపు, ఎల్లుండి మాపప్ కార్యక్రమం
ఇందుకుగాను అన్ని ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ పూర్తి చేసింది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు.
Newdelhi, Mar 3: దేశవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం (Pulse Polio Vaccination Drive) జరగనుంది. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ పూర్తి చేసింది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల చిన్నారులందరికీ (Children) పోలియో చుక్కలు వేయనున్నారు. ఇక, తెలంగాణలో 40,57,320 మంది ఆ వయసు చిన్నారులున్నారు. వారందరి కోసం 50.30 లక్షల పోలియో డోసులను వైద్యశాఖ సిద్ధం చేసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కల కార్యక్రమం జరగనుంది. అలాగే సోమ, మంగళవారాల్లో మాపప్ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చేయనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)