Mumbai Local Train Accident: వీడియో ఇదిగో,రద్దీ రైలు ఎక్కుతూ దాని కిందపడిన మహిళ, ప్రాణాలతో బయటపడినా రెండు కాళ్లు పొగొట్టుకున్న వైనం

మ‌హారాష్ట్ర‌లోని ముంబై లోక‌ల్ స్టేష‌న్‌లో ఓ మ‌హిళ రైలు కింద ప‌డి ప్రాణాల‌తో బయటపడినప్పటికీ ఆమె రెండు కాళ్లను కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు ఓ మ‌హిళ లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది.

Tragic accident in Navi Mumbai

మ‌హారాష్ట్ర‌లోని ముంబై లోక‌ల్ స్టేష‌న్‌లో ఓ మ‌హిళ రైలు కింద ప‌డి ప్రాణాల‌తో బయటపడినప్పటికీ ఆమె రెండు కాళ్లను కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు ఓ మ‌హిళ లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ రైలు రద్దీగా ఉండటంతో ఆమె ఎక్కే క్రమంలో కాలు జారింది.

దీంతో.. రైలు కింద పడిపోయింది. అప్పటికే రైలు కదలడంతో.. ఒక కంపార్ట్‌మెంట్ ఆమె పై నుంచి వెళ్లింది. అప్పుడు ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బంది అలారం మోగించడంతో.. రైలు వెనక్కు వెళ్లింది. పోలీసు అధికారులు ట్రాక్‌లపై దిగి.. ఆమెను పైకి తీసుకొచ్చారు. వెంట‌నే మ‌హిళ‌ను సమీపంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన‌ట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నిల తెలిపారు. ఈ ఘటనలో మహిళ తన రెండు కాళ్ల‌ను కోల్పోయింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement