Uttar Pradesh Accident: యూపీలో ఘోర ప్రమాదం.. నదిలోపడిన యాత్రికుల ట్రాక్టర్.. చిన్నారులు సహా 15 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది.
Lucknow, Feb 25: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తుల (devotees)తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏడుగురు చిన్నారులు కూడా ఉండటం కలచివేస్తోంది. మాఘ పూర్ణిమ (Magh Purnima) సందర్భంగా కొందరు భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు ట్రాక్టర్ లో కదర్ గంజ్ కు చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ప్రకటించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)