Uttar Pradesh: వైరల్ వీడియో... కారులో ఇద్దరూ ఆ పనిలో ఉండగా బీజేపీ నేతను చితక్కొట్టిన అతని భార్య, కారులో ఉన్న మహిళను చితక్కొటిన ఆమె భర్త, పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ

అయితే సోంకర్‌ భార్య, ఆయన అత్తింటివారు, బిందు భర్త కలిసి వారిద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

BJP Leader Thrashed By Wife, In Laws, After Being Caught With Female Friend

యూపీలోని బుందేల్‌ఖండ్ ప్రాంత బీజేపీ కార్యదర్శి మోహిత్ సోంకర్ తన స్నేహితురాలు, బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బిందుతో కలిసి కారులో వెళ్లి పార్టీ చేసుకున్నారు. అయితే సోంకర్‌ భార్య, ఆయన అత్తింటివారు, బిందు భర్త కలిసి వారిద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీజేపీ నేత సోంకర్‌ను ఆయన భార్య, అత్త కలిసి రోడ్డుపై చెప్పులతో కొట్టారు. అత్తింటి కుటుంబ సభ్యులు ఆయనను చితకబాదారు.

ఇక వ్యాపారవేత్త అయిన బిందు భర్త, సోంకర్‌ భార్య కలిసి ఆ మహిళను కూడా చితకొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో సోంకర్‌ భార్య, బిందు భర్త కలిసి వారిద్దరి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై దర్యాప్తు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)