Uttar Pradesh Horror: యూట్యూబ్ వీడియో చూసి 11 ఏళ్ల బాలుడి ఆత్మహత్య.. ఉత్తరప్రదేశ్ లో ఘటన

ఉత్తర ప్రదేశ్‌ లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలా చనిపోవాలి అనే వీడియో చూసి ఓ బాలుడు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Representational Image (Photo Credits: File Image)

Lucknow, Dec 24: ఉత్తర ప్రదేశ్‌ లో (Uttarpradesh) తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలా చనిపోవాలి అనే వీడియో (Video) చూసి ఓ బాలుడు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హమీర్‌ పూర్ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిఖిల్ సాహూ అనే ఆరో తరగతి విద్యార్థి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేస్ టూ డై అనే వీడియో చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడిది ఆత్మహత్య అన్న విషయం పోస్ట్‌ మార్టంలో తేలిందని పోలీసులు తెలిపారు. అతడి నిర్ణయం వెనక కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇలాంటి ఘటనే రెండు రోజుల క్రితం రాజస్థాన్ లోనూ చోటు చేసుకోవడం గమనార్హం.

Prof Sameer Khandekar: ఆడిటోరియంలో ప్రసంగిస్తూ కుప్పకూలి మరణించిన ఐఐటీ ప్రొఫెసర్.. గుండెపోటే కారణమని వెల్లడి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now