Viral Video: లోకో పైలట్లు లేకుండా.. 53 వేగన్లతో.. ఏకంగా 70 కిలోమీటర్లు దూసుకెళ్లిన గూడ్సు రైలు.. అసలేం జరిగింది.. రైలు ఎంత వేగంగా దూసుకెళ్ళిందో వీడియో చూడండి!
లోకో పైలట్లు లేకుండా 53 వేగన్లతో ఓ గూడ్సు రైలు 70 కిలోమీటర్లు పరుగులు తీసింది. ఆదివారం ఉదయం 7.25-9.00 గంటల మధ్య ఈ ఘటన జరిగింది.
Newdelhi, Feb 26: లోకో పైలట్లు లేకుండా 53 వేగన్లతో ఓ గూడ్సు రైలు (Goods Train) 70 కిలోమీటర్లు పరుగులు తీసింది. ఆదివారం ఉదయం 7.25-9.00 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 53 వేగన్లతో చిప్ స్టోన్స్ ను (Chip Stones) మోసుకుని జమ్ము నుంచి పంజాబ్ వైపు ఈ రైలు బయలుదేరింది. రైలు నిలిపిన ప్రదేశం కొంత వాలుగా ఉండడం, బ్రేకులు వేసి ఉండకపోవడమే రైలు దూసుకువెళ్లడానికి కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)