Viral Video: బిచ్చగాడిని అడిగి మరీ చెప్పుతో కొట్టించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి.. మధ్యప్రదేశ్ వీడియో వైరల్
కానీ మధ్యప్రదేశ్ లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం బాబాగా పేర్కొనే ఓ బిచ్చగాడితో అడిగి మరీ చెప్పుతో కొట్టించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.
Bhopal, Nov 18: ఎన్నికల్లో పోటీచేసే కొందరు అభ్యర్థులు స్వామీజీలు, బాబాల ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో ఓ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి మాత్రం బాబాగా పేర్కొనే ఓ బిచ్చగాడితో (Fakira Baba) అడిగి మరీ చెప్పుతో కొట్టించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. రాత్లామ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పారస్ తన ప్రత్యర్థి జోరు తట్టుకోలేకపోయినట్టున్నారు. ఎవరు చెప్పారో తెలియదు కానీ బాబాగా చెప్పబడే ఓ బిచ్చగాడి దగ్గరికి వెళ్లి తనను చెప్పుతో కొట్టి ఆశీర్వదించాలని వేడుకున్నారు. అడిగిందే తడవుగా ఆ యాచకుడు తన చెప్పు తీసి పారస్ ను కొట్టడం.. ఆ తర్వాత అతడు తన చెప్పులను పారవేయడం.. పారస్ కొత్త చెప్పులను భక్తిశ్రద్ధలతో బిచ్చగాడికి అందించడం చకచకా జరిగిపోయాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)