Viral: భయంకరమైన వీడియో, మెట్ల మీద నుంచి నేరుగా ఇంట్లోకి వెళుతున్న భారీ కొండ చిలువ, ట్విట్టర్‌లో షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే వీడియో వైరల్‌

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ముప్పై రెండు సెకన్‌ల నిడివిగల ఈ వీడియోలో ఒక భారీ కొండచిలువ ఓ ఇంట్లోకి దూరుతున్న దృశ్యాలు ఉన్నాయి. మెట్లకు ఆనుకుని ఉండే రెయిలింగ్‌పై పాకుతూ ఆ కొండచిలువ ఇంటి పై అంతస్తులోకి వెళ్తున్న దృశ్యాలు నెటిజన్‌ల ఒళ్లు జలదిరింప జేస్తున్నాయి.

Screen garb from viral video

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ముప్పై రెండు సెకన్‌ల నిడివిగల ఈ వీడియోలో ఒక భారీ కొండచిలువ ఓ ఇంట్లోకి దూరుతున్న దృశ్యాలు ఉన్నాయి. మెట్లకు ఆనుకుని ఉండే రెయిలింగ్‌పై పాకుతూ ఆ కొండచిలువ ఇంటి పై అంతస్తులోకి వెళ్తున్న దృశ్యాలు నెటిజన్‌ల ఒళ్లు జలదిరింప జేస్తున్నాయి. ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సుశాంతానంద ఈ వీడియోను ఇవాళ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ట్విట్టర్‌లో షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌ అయ్యింది. సోమవారం ఉదయం పదిన్నరకు పోస్టు చేయగా.. మధ్యాహ్నానికి 10 వేల మందికిపైగా వీక్షించారు. మరో 400 మందికిపైగా లైక్‌ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement