Python Swallows Calf Alive: ఆవు దూడను సజీవంగా మింగేసిన కొండ చిలువ, సగ భాగాన్ని మింగేసి మిగతా భాగాన్ని చుట్టేసి పడుకున్న పైతాన్

చిత్రహత్ ప్రాంతంలోని పరానా గ్రామంలో గల యమునా అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో ఓ చోట కొండచిలువను గొర్రెల కాపరులు గుర్తించారు.

Python Swallows Calf Alive, Villagers Use Sticks To Save It

ఉత్తరప్రదేశ్‌ ఆగ్రా (Agra)లో భారీ కొండచిలువ (Python) ఓ ఆవు దూడను సజీవంగా మింగేసింది (Python Swallows Calf Alive). చిత్రహత్ ప్రాంతంలోని పరానా గ్రామంలో గల యమునా అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో ఓ చోట కొండచిలువను గొర్రెల కాపరులు గుర్తించారు. 16 అడుగుల ఈ పైతాన్‌ (16 Foot Python) ఆవు దూడ సగ భాగాన్ని మింగేసి.. మిగతా సగభాగాన్ని చుట్టేసుకుని కనిపించింది. స్థానికులు వెంటనే దూడను కాపాడే ప్రయత్నం చేశారు. కర్రల సాయంతో కొండచిలువ శరీరం నుంచి దూడను బయటకు నెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. పైతాన్‌ పొట్ట నుంచి ఆవుదూడను బయటకు తీసినప్పటికీ.. అది ఊరిరాడక అప్పటికే ప్రాణాలు కోల్పోయింది.  కాన్పూర్‌లో దారుణం, హైవేపై తల లేకుండా నగ్నంగా మహిళ మృతదేహం, ఆ పార్టులో దారుణంగా రక్తంతో తడిసి చేతులు, కాళు విరిగిపోయి..

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)