Viral Wedding Video: ఇదేమి వెడ్డింగ్, మంటల్లో వధూవరులు, షాకయిన పెళ్లికి వచ్చిన అతిధులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఓ వెడ్డింగ్ జంట చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేబ్-అంబిర్ అనే ఆ కొత్త జంట ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్స్ కావడంతో ఫైర్ స్టంట్ చేశారు. స్టంట్‌ ప్రారంభించే ముందు ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒకచోట నిలుచున్నారు.

Bride and groom set themselves on fire in wedding exit stunt

ఓ వెడ్డింగ్ జంట చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేబ్-అంబిర్ అనే ఆ కొత్త జంట ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్స్ కావడంతో ఫైర్ స్టంట్ చేశారు. స్టంట్‌ ప్రారంభించే ముందు ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒకచోట నిలుచున్నారు. ఇంతలో ఓ వ్యక్తి అంబిర్ కుడి చేతిలో పట్టుకున్న ఫ్లవర్ బొకేకి నిప్పంటించాడు. క్షణాల్లో ఆ మంటలు వధూవరుల వీపు భాగంలోకి వ్యాపించాయి. అలానే రెండడుగులు ముందుకు నడిచిన జంట... ఆ తర్వాత చిన్నగా పరిగెత్తారు.

కొద్ది దూరం పాటు పరిగెత్తి.. ఒకచోట మోకాళ్లపై కూలబడ్డారు. వెనకాలే పరిగెత్తుకొచ్చిన ఓ వ్యక్తి వెంటనే మంటలార్పేశాడు. ఈ కొత్త జంట చేసిన ఫైర్ స్టంట్‌కి వెడ్డింగ్ రిసెప్షన్‌కి వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. గేబ్, అంబిర్ ప్రస్తుతం హాలీవుడ్‌లో స్టంట్ మాస్టర్స్‌గా పనిచేస్తున్నారు. అందుకే ఇంత అలవోకగా... ఎటువంటి బెరుకు లేకుండా ఆ స్టంట్ కానిచ్చేశారు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ రస్ పావెల్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement