Viral Video: పోలీసులపై చిరుత పులి దాడి, అయినా పులిని బంధించిన పోలీస్ అధికారులు, సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

చిరుతపులిని పట్టుకునే క్రమంలో అది..పోలీసులూ, అటవీ అధికారులపైకి దూకింది. చిరుత దాడిలో స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు అటవీశాఖ అధికారులు గాయపడ్డారు.

Leopard Enters Panipat Village, Attacks Forest Officials

హర్యానాలో చిరుతపులిని పట్టుకునే ఆపరేషన్‌లో ఓ పోలీస్‌, ఇద్దరు అటవీ శాఖ అధికారులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటన హర్యానాలో ఆదివారం చోటుచేసుకుంది. పానిపట్‌ జిల్లాలో బెహ్రాంపూర్‌ గ్రామంలో చిరుతపులిని పట్టుకునేందుకు అధికారులు ఆదివారం ఆపరేషన్‌ చేపట్టారు. తమ గ్రామంలో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారుల బృందం చర్యలు చేపట్టింది. చిరుతపులిని పట్టుకునే క్రమంలో అది..పోలీసులూ, అటవీ అధికారులపైకి దూకింది. చిరుత దాడిలో స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు అటవీశాఖ అధికారులు గాయపడ్డారు. అయినప్పటికీ ఎట్టకేలకు చిరుతపులిని విజయవంతంగా బంధించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారుల ధైర్యాన్ని మెచ్చుకుంటూ పానిపట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.