Man Catches Huge Anaconda Video: వామ్మో..భారీ అనకొండను పట్టుకుని ముద్దుపెట్టుకున్న రియల్ టార్జాన్, వీడియో సోషల్ మీడియాలో వైరల్
భారీ అనకొండను ఉత్తి చేతులతో ఓ వ్యక్తి పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఫ్లోరిడాలోని మియామికి చెందిన జూ కీపర్ మైక్ హోల్‌స్టన్ Instagramలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
Man Catches Huge Anaconda With Bare Hands: భారీ అనకొండను ఉత్తి చేతులతో ఓ వ్యక్తి పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఫ్లోరిడాలోని మియామికి చెందిన జూ కీపర్ మైక్ హోల్‌స్టన్ Instagramలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. తనను తాను ది రియల్ టార్జాన్, ది కింగ్ ఆఫ్ ది జంగిల్ అని చెప్పుకునే హోల్‌స్టన్ తరచుగా వన్యప్రాణులకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన వీడియోలను చాలా షేర్ చేస్తూ ఉంటాడు.
ఈ సారి నీటిలో దాగి వున్న ఓ భారీ అనకొండను జాగ్రత్తగా సమీపించి, మెల్లిగా వెళ్లి, చటుక్కున దాని తలను ఒడిసిపట్టుకోవడంతో ఈ వీడియో మొదలవుతుంది. సాధారణంగా అనకొండ ఎంత బలిష్టమైన వారినైనా తన పట్టుతో లొంగదీసుకుంటుంది. వాట్ యాన్ ఎక్స్‌పిడిషన్ వెనిజులాకు మాన్‌స్టర్ అనకొండను విజయవంతంగా పట్టుకున్నాం అనే క్యాప్షన్‌తో దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 5 రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో 11.2 మిలియన్లకు పైగా వ్యూస్‌లను సాధించింది. మూడు లక్షలకు కమెంట్లను సాధించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)