Kannappa Update: అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం, కన్నప్ప నుంచి మారెమ్మ పాత్ర ఫస్ట్ లుక్ ఇదిగో
ఈ సోమవారం నాడు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి అప్ డేట్లు వస్తూనే ఉన్నాయి. విష్ణు గతంలో ప్రకటించినట్టుగా ప్రతి సోమవారం కన్నప్ప నుంచి ఎప్పటికప్పుడు తాజా కబుర్లు వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించి లుక్‌ను విడుదల చేశారు. గత వారం కన్నప్ప నుంచి విధేయుడు, స్నేహితుడు అంటూ తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి లుక్‌ను రిలీజ్ చేశారు.
ఈ సోమవారం నాడు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అవా ఎంటర్టయిన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Here's First look
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)