Vande Bharat Train: సెల్ఫీల కోసం వందేభారత్ ట్రైన్ ఎక్కేశాడు, డోర్ లాక్ అవడంతో భారీగా ఫైన్ కట్టాడు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్‌ ట్రైన్‌ పట్టాలెక్కిన సంగతి విదితమే. అయితే తాజాగా ఈ ట్రైన్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వందే భారత్‌ ట్రైన్‌ రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో ఆగిన సమయంలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ట్రైన్‌ ఎక్కేశాడు. సెల్ఫీలు తీసుకున్నాడు.

Vande Bharat train (Photo-Video Grab)

తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్‌ ట్రైన్‌ పట్టాలెక్కిన సంగతి విదితమే. అయితే తాజాగా ఈ ట్రైన్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వందే భారత్‌ ట్రైన్‌ రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో ఆగిన సమయంలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ట్రైన్‌ ఎక్కేశాడు. సెల్ఫీలు తీసుకున్నాడు. ఈ లోపు డోర్లు లాక్‌ అయిపోయాయి. ఈలోపు టీసీ వచ్చి టికెట్‌ అడిగేసరికి,  తాను ఫోటోలు కోసం ట్రైన్‌ ఎక్కానని, డోర్లు ఆటోమేటిక్‌గా లాక్‌ అవుతాయనే విషయం తెలియదన్నాడు. టీసీ తాను కూడా ఏమీ చేసే పరిస్థితి లేదని, వచ్చే స్టేషన్‌ వరకూ ఆగాల్సిందేనని చెప్పేశాడు. దాంతో పాటు జరిమానా కూడా విధించాడు టీసీ. ఇక చేసేది లేక ఫైన్‌ చెల్లించాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement