Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం, అంబులెన్స్ లేక చిన్నారి మృతదేహాన్ని భుజాన వేసుకుని బస్టాండ్‌కు చేరుకున్న మేనమామ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ప్రైవేటు వాహన ఖర్చును భరించలేని ఆ వ్యక్తి, చేసేదేంలేక పాప మృతదేహాన్ని భుజాలపై వేసుకొని బస్టాండ్‌కు వెళ్లాడు. అలాగే బస్సు ఎక్కి గ్రామానికి వెళ్లాడు. పాప మృతదేహంతో ఆ మేనమామ రద్దీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Madhya Pradesh man walks on busy road to bus stop (Photo-Video Grab)

మధ్యప్రదేశ్‌లో ప్రమాదంలో మరణించిన బాలికను పోస్టుమార్టం నిమిత్తం ఛాతర్‌పూర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పాప మేనమామ మృతదేహాన్ని గ్రామానికి తీసుకుపోయేందుకు వాహనం కోసం ప్రయత్నించగా.. ఆస్పత్రి అంబులెన్స్‌ అందుబాటులో లేదు. ప్రైవేటు వాహన ఖర్చును భరించలేని ఆ వ్యక్తి, చేసేదేంలేక పాప మృతదేహాన్ని భుజాలపై వేసుకొని బస్టాండ్‌కు వెళ్లాడు. అలాగే బస్సు ఎక్కి గ్రామానికి వెళ్లాడు. పాప మృతదేహంతో ఆ మేనమామ రద్దీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement