Viral: తల్లి చేతిలో నుండి రైలు కింద పడబోయిన చిన్నారి, పరుగున వెళ్లి కాపాడిన ముంబై పోలీస్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ ఘటన ముంబయిలోని మన్‌కుర్ద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ చిన్నారిని ఎత్తుకుని రెండవ నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన లోకల్‌ ట్రైన్‌ను ఎక్కింది. అయితే రద్దీ కారణంగా రైలు కదులుతున్న సమయంలో ఆమె పట్టుకోల్పోవడంతో మహిళ చేతిలోని చిన్నారి జారి రైలు కింద పడబోయింది.

Mumbai Railway Cop Saves Child Who Fell Off Moving Train

కదులుతున్న రైలు కింద పడిపోబోయిన ఓ చిన్నారిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన ముంబయిలోని మన్‌కుర్ద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ చిన్నారిని ఎత్తుకుని రెండవ నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన లోకల్‌ ట్రైన్‌ను ఎక్కింది. అయితే రద్దీ కారణంగా రైలు కదులుతున్న సమయంలో ఆమె పట్టుకోల్పోవడంతో మహిళ చేతిలోని చిన్నారి జారి రైలు కింద పడబోయింది. అక్కడే ఉన్న రైల్వే పోలీసు అక్షయ్‌ సోయ గమనించి చిన్నారి రైలు కిందపడకుండా కాపాడాడు. అనంతరం కొంత దూరం వెళ్లాకా సదరు మహిళను అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)