Snake Head In Plane Meal: విమానంలో అందించే భోజనంలో పాము తల, ఒక్కసారిగా షాక్ తిన్న సిబ్బంది, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు

విమానంలో ప్రయాణిస్తున్న ఓప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురయింది. టర్కీకి చెందిన విమాన సంస్థలో పని చేస్తున్న సిబ్బంది విమానంలో అందించిన ఆహారం తింటుండగా అందులోని కూరలో పాము తలను చూసి హడలిపోయాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Snake-head

విమానంలో ప్రయాణిస్తున్న ఓప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురయింది. టర్కీకి చెందిన విమాన సంస్థలో పని చేస్తున్న సిబ్బంది విమానంలో అందించిన ఆహారం తింటుండగా అందులోని కూరలో పాము తలను చూసి హడలిపోయాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్‌ విమానంలో సిబ్బందికి ఈ ఘటన ఎదురైంది. విమానంలో అందించిన ఆహారాన్ని తింటుండగా.. ఆలూ, ఇతర కూరగాయలతో చేసిన కూరలో పాము తల కనిపించినట్లు సిబ్బంది చెప్పారు.వీడియోలో.. ఆహారం వడ్డించిన ప్లేట్‌ మధ్యలో చిన్న పాము తల స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఆహార సరఫరాదారుతో కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement