Lok Sabha Results in Movie Theatres: ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి.. సినిమా థియేటర్లలో లైవ్ ప్రసారం.. మహారాష్ట్రలోని పలు థియేటర్లలో ఏర్పాటు.. టికెట్ రూ. 99 నుంచి రూ. 300.. ఇప్పటికే పలు థియేటర్లు ఫుల్
ప్రపంచ కప్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ ను ప్రసారం చేసిన సినిమా థియేటర్లు ఇప్పుడు ఎన్నికల ఫలితాలను కూడా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి.
Mumbai, June 1: ప్రపంచ కప్ ఫైనల్ (World Cup Final), ఐపీఎల్ ఫైనల్ (IPL Final) ను ప్రసారం చేసిన సినిమా థియేటర్లు ఇప్పుడు ఎన్నికల ఫలితాలను కూడా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. మరో మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రిజల్ట్స్ ను సినిమా థియేటర్లలో లైవ్ లో ప్రదర్శించాలని మహారాష్ట్రలోని కొన్ని థియేటర్ల యజమానులు నిర్ణయించినట్టు తెలిసింది. ఆరు గంటలపాటు ఫలితాలను ప్రసారం చేయనుండగా టికెట్ ధరలు రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉన్నాయి. అంతేకాదు, థియేటర్లలో ఎన్నికల ఫలితాలు చూపేందుకు జనం కూడా ఆసక్తి చూపిస్తున్నారట. దీంతో చాలా థియేటర్లు ఇప్పటికే ఫుల్ అయిపోయినట్టు సమాచారం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)