Kedarnath Temple Opened: ఆర్మీబ్యాండ్ మేళాలతో తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు (వీడియోతో)

ఉత్తరాఖండ్‌ లోని గర్వాల్ ప్రాంతంలోని ఈ ఆలయం తలుపులు మంగళవారం ఉదయం తెరుచుకున్నాయి. ఉదయం 6.20 గంటలకు ఆర్మీబ్యాండ్ మేళాలతో ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.

Kedarnath (Credits: Twitter)

Newdelhi, April 25: ప్రసిద్ధ చార్‌ధామ్ ఆలయాల్లో (Chardham Temples) కేదార్‌నాథ్ ధామ్ (Kedarnath Temple) ఒకటి. ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లోని గర్వాల్ ప్రాంతంలోని ఈ ఆలయం తలుపులు మంగళవారం ఉదయం తెరుచుకున్నాయి. ఉదయం 6.20 గంటలకు ఆర్మీబ్యాండ్ మేళాలతో ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకోవడంతో హరహర మహాదేవ్ కీర్తనలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని 35 క్వింటాళ్ల పూలతో అలకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు జగద్గురు రావల్ భీమ్ శంకర్‌లింగ్ శివాచార్య ఆలయం తలుపులు తెరిచారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయం తలుపులు తెరిచిన అనంతరం కేదార్ ధామ్‌ను దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం.. సునామీ హెచ్చరిక.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం.. ఆ తర్వాత సునామీ హెచ్చరికల ఎత్తివేత