IPL Auction 2025 Live

UP Shocker: తాగున్న వ్యక్తిని 61 సార్లు చెప్పుతో కొట్టిన పోలీసు.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.. ఉత్తరప్రదేశ్ లో ఘటన.. వీడియో ఇదిగో!

ఏకంగా 61 సార్లు అతడిని చెప్పుతో కొట్టాడు. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాలో ఈ దారుణం జరగ్గా ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ అత్యుత్సాహం, వ్యక్తిపై దాష్టీకానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Credits: Twitter

Newdelhi, July 24: తాగున్న వ్యక్తిపై కానిస్టేబుల్ ఒకరు రెచ్చిపోయాడు. ఏకంగా 61 సార్లు అతడిని చెప్పుతో కొట్టాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని హర్దోయ్ జిల్లాలో ఈ దారుణం జరగ్గా ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ (Suspend) చేశారు. కానిస్టేబుల్ అత్యుత్సాహం, వ్యక్తిపై దాష్టీకానికి సంబంధించిన వీడియో (Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. అసలేం జరిగిందంటే.. శనివారం దినేశ్ ఆత్రీ అనే కానిస్టేబుల్ సాధారణ దుస్తుల్లో మార్కెట్‌ కు వెళ్లారు. అక్కడ ఆయనకు ఓ వ్యక్తి తాగిన మైకంలో మహిళతో సహా పలువురిని ఇబ్బంది పెడుతూ కనిపించాడు. ఆత్రి అతడిని వారించేందుకు ప్రయత్నించగా తాగుబోతు వినిపించుకోలేదు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైందని పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్‌ తో కూడా ఆ వ్యక్తి ఇష్టారీతిన వ్యవహరించడంతో కానిస్టేబుల్ అతడిపై చేయిచేసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని ఏఎస్పీ దుర్గేశ్ కుమార్ పేర్కొన్నారు. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని చెప్పిన ఆయన.. ఆ కానిస్టేబుల్‌ను తక్షణం సస్పెండ్ చేసినట్టు చెప్పారు.

Hyderabad Shocker: ఫ్లైఓవర్ పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి యువకుడి మృతి.. బైక్‌ పై వేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టిన యువకుడు.. ఘటనాస్థలంలోనే మృతి, వెనక కూర్చున్న వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స.. ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వీడియోతో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)