Viral Video: షాకింగ్ వీడియో.. వేగంగా వెళుతున్న చెత్త వాహనంపై శక్తిమాన్‌ తరహాలో విన్యాసాలు, ఒక్కసారిగా కిందపడటంతో తీవ్ర గాయాలు, శక్తిమాన్‌గా వ్యవహరించొద్దని వార్నింగ్ ఇచ్చిన యూపీ పోలీసులు

ఒక వాహనంపై ప్రమాదకరంగా స్టంట్లు చేసి గాయపడిన యువకుడి వీడియోను సోషల్‌ మీడియాలో యూపీ పోలీసులు పోస్ట్‌ చేశారు. ఉత్తర ప్రదేశ్‌ పోలీస్‌ అధికారిణి శ్వేతా శ్రీవాస్తవ ట్విట్టర్‌లో ఆదివారం ఈ వీడియో షేర్ చేస్తూ.. శక్తిమాన్‌గా వ్యవహరించొద్దని సూచించారు.

Uttar Pradesh Man's Dangerous Stunt on Moving Vehicle Goes Viral

ఒక వాహనంపై ప్రమాదకరంగా స్టంట్లు చేసి గాయపడిన యువకుడి వీడియోను సోషల్‌ మీడియాలో యూపీ పోలీసులు పోస్ట్‌ చేశారు. ఉత్తర ప్రదేశ్‌ పోలీస్‌ అధికారిణి శ్వేతా శ్రీవాస్తవ ట్విట్టర్‌లో ఆదివారం ఈ వీడియో షేర్ చేస్తూ.. శక్తిమాన్‌గా వ్యవహరించొద్దని సూచించారు. షేర్ చేసిన వీడియోలో.. ఒక యువకుడు చెత్త వాహనంపై శక్తిమాన్‌ తరహాలో విన్యాసాలు చేశాడు. కదులుతున్న గార్బేజ్‌ వాహనంపై పుష్‌అప్‌లు తీశాడు. అనంతరం దానిపై ఠీవిగా నిల్చొని బిల్డప్‌ ఇచ్చాడు. అయితే వాహనం మలుపు తిరుగడంతో అదుపు తప్పి దాని పైనుంచి రోడ్డుపై పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడి ఫొటోలు కూడా ఆ వీడియోలో ఉంచారు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement