Free Lemon, Petrol: మొబైల్ కొంటే ఉచితంగా నిమ్మ‌కాయ‌లు, లీట‌ర్ పెట్రోల్, వారణాసిలో మొబైల్ షాపు నిర్వాహ‌కుడు వినూత్న ఆఫర్

వారణాసిలో ఓ మొబైల్ షాపు నిర్వాహ‌కుడు క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు వినూత్నంగా ఆలోచించాడు. త‌న దుకాణంలో మొబైల్ కొంటే ఉచితంగా నిమ్మ‌కాయ‌లు, లీట‌ర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తాన‌ని పోస్ట‌ర్లు ఏర్పాటు చేసి, కస్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నాడు

Lemon, petrol being offered free with mobile accessories in Varanasi (Photo-Video Grab)

వారణాసిలో ఓ మొబైల్ షాపు నిర్వాహ‌కుడు క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు వినూత్నంగా ఆలోచించాడు. త‌న దుకాణంలో మొబైల్ కొంటే ఉచితంగా నిమ్మ‌కాయ‌లు, లీట‌ర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తాన‌ని పోస్ట‌ర్లు ఏర్పాటు చేసి, కస్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నాడు. రూ. 10 వేల విలువ చేసే మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే.. లీట‌ర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తాన‌ని పేర్కొన్నారు. మొబైల్ యాక్సెస‌రీస్ కొన్న వారికి 2 నుంచి 4 నిమ్మ‌కాయ‌లు ఉచితంగా ఇస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు. గ‌త కొద్ది వారాల నుంచి పెట్రోల్‌తో పాటు నిమ్మ‌కాయ‌ల ధ‌ర‌లు అమాంతం పెరిగిన సంగ‌తి తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement