Woman Dressed as Manjulika: వీడియో ఇదిగో, మెట్రో రైలులో చంద్రముఖి, హడలిపోయిన ప్రయాణికులు, ఇదేం పోయేకాలం నీకు అంటూ యువతిపై మండిపాటు
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ యువతి చంద్రముఖి సీక్వెల్ అయిన బాలీవుడ్ హర్రర్, కామెడీ చిత్రం ‘భూల్ భూలయ్య’ సినిమాలోని ముంజులిక పాత్రలోని దుస్తులు ధరించి ఉంది.
మెట్రోలోని ప్రయాణికులను యువతి చంద్రముఖి అవతారంలో హడలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ యువతి చంద్రముఖి సీక్వెల్ అయిన బాలీవుడ్ హర్రర్, కామెడీ చిత్రం ‘భూల్ భూలయ్య’ సినిమాలోని ముంజులిక పాత్రలోని దుస్తులు ధరించి ఉంది. క్లాసికల్ డ్యాన్స్ దుస్తులతో.. జుట్టుని ముఖంపై వేసుకొని అచ్చం చంద్రముఖిలా బిత్తర చూపులు చూస్తూ మెట్రోలో కూర్చున్న వారిని భయపెట్టడానికి ప్రయత్నించింది. మెట్రో కంపార్ట్‌మెంట్‌లో ఒక్కొక్క ప్రయాణికుడి వద్దకు నడుచుకుంటూ వెళ్తూ వారిని పట్టుకొని భయపెట్టింది. అయితే యువతిని చూసిన పలువురు ప్రయాణికులు షాకవ్వగా ఓ వ్యక్తి భయంతో ముందుకు పరుగు తీయడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో యువతి ప్రవర్తనపై మిశ్రమ స్పందన లభిస్తోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)