Collector Disguises As Farmer: రైతు వేషంలో వచ్చిన జిల్లా కలెక్టర్‌.. ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాల గుట్టురట్టు కోసమే.. (వీడియో)

కలెక్టర్లు, పోలీసు ఆఫీసర్లు మారువేషంలో వెళ్లి అక్రమార్కుల గుట్టురట్టు చేసే సీన్‌ లు సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటి ఘటనే ఒడిశాలోని భద్రక్‌ జిల్లాలో జరిగింది.

Collector Disguises As Farmer: రైతు వేషంలో వచ్చిన జిల్లా కలెక్టర్‌.. ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాల గుట్టురట్టు కోసమే.. (వీడియో)
Collector Disguises As Farmer (Credits: X)

Newdelhi, Feb 4: కలెక్టర్లు (Collectors), పోలీసు ఆఫీసర్లు మారువేషంలో వెళ్లి అక్రమార్కుల గుట్టురట్టు చేసే సీన్‌ లు సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటి ఘటనే ఒడిశాలోని భద్రక్‌ జిల్లాలో జరిగింది. జిల్లా కలెక్టర్‌ దిలీప్‌ రౌత్రాయ్‌ నిజజీవితంలో ఈ పని చేసి, అక్రమార్కులకు వణుకు పుట్టించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ధామ్‌ నగర్‌ బ్లాక్‌ లోని కాటాసాహి మండీలో ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నట్టు రైతులు ఫిర్యాదులు చేశారు. వరి సేకరణ కేంద్రాల్లో పంట దిగుబడిలో నాణ్యత లేదని పేర్కొంటూ తమకు తక్కువ ధర ఇస్తున్నారని వాపోయారు.

నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)

Here's Video:

ఆ ఫిర్యాదుతో..

దీంతో ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్‌ తానే స్వయంగా వెళ్లాలని నిర్ణయించారు. ధామ్‌ నగర్‌ బ్లాక్‌ లోని కాటాసాహి మండీలోని ధాన్యం సేకరణ కేంద్రానికి రైతు వేషధారణలో (Collector Disguises As Farmer) వెళ్లారు. కొంత ధాన్యాన్ని విక్రయించేందుకు కాంటాకు వేశారు. అయితే, వృధా సాకుతో 8 కిలోలకు డబ్బులు తక్కువ ఇస్తానని అధికారి చెప్పాడు. ఆ తర్వాత తానెవరో చెప్పిన కలెక్టర్.. సదరు అధికారికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ

(The above story first appeared on LatestLY on Feb 04, 2025 09:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).