Viral Video: సూర్య కుమార్ యాదవ్ షాట్లతో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న యువతి, ఫిదా అయిన లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్

టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తరహా విధ్వంకర షాట్లతో విరుచుకుపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముమల్‌ అచ్చం సూర్యకుమార్‌లా 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడుతుంది.

young girl playing outrageous shots akin to Suryakumar Yadav takes internet by storm (photo-Video Grab)

రాజస్థాన్‌కు చెందిన ముమల్‌ మెహర్‌ అనే ఓ బాలిక.. టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తరహా విధ్వంకర షాట్లతో విరుచుకుపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముమల్‌ అచ్చం సూర్యకుమార్‌లా 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడుతుంది.ముమల్‌​ విన్యాసాలకు సంబంధించిన ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. లేడీ స్కై అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోను బట్టి చూస్తే రాజస్థాన్‌లో ఏదో మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణగా తెలుస్తోంది.

ముమల్‌ విన్యాసాలకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సైతం ఫిదా అయ్యాడు. సచిన్‌ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. నిన్ననే కదా వేలం అయ్యింది.. అప్పుడే విధ్వంసం మొదలైందా..? అంటూ కామెంట్‌ చేశాడు. ముమల్‌ విన్యాసాలకు సంబంధించిన వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ సైతం ట్విటర్‌లో షేర్‌ చేశారు. భవిష్యత్తులో ముమల్‌ టీమిండియా జెర్సీ ధరించే స్థాయికి ఎదిగేందుకు తోడ్పడాలని ఆమె రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ను అభ్యర్ధించారు. మొత్తంగా ముమల్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు