1200 Voters in One Family: ఒకే కుటుంబంలో 1200 మంది ఓటర్లు.. ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతల క్యూ.. ఎక్కడంటే??

ఒక ఇంట్లో ముగ్గురు, నలుగురు మహా అయితే ఓ ఏడెనిమిది మంది ఓటర్లు ఉంటారు. అయితే, ఒకే కుటుంబంలో ఏకంగా 1200 మంది ఓటర్లు ఉన్నారు.

One Family (Credits: X)

Newdelhi, Mar 27: ఇదో నమ్మలేని ఘటన. ఒక ఇంట్లో ముగ్గురు, నలుగురు మహా అయితే ఓ ఏడెనిమిది మంది ఓటర్లు (Voters) ఉంటారు. అయితే,  ఒకే కుటుంబంలో ఏకంగా 1200 మంది ఓటర్లు (1200 Voters in One Family) ఉన్నారు. అస్సాంలోని సోనిట్‌ పూర్‌ జిల్లా నేపాలి పామ్‌ గ్రామం ఇందుకు వేదికైంది. ఈ గ్రామంలోని 300 కుటుంబాలు ఒకే వంశానికి చెందినవే. వారంతా రాన్‌ బహదూర్‌ తాపా వారసులు. ప్రస్తుతం వారి సంఖ్య 2500 ఉండగా, అందులో 1200 మంది ఓటర్లు. ఐదుగురు భార్యలున్న ఆయనకు 12 మంది కొడుకులు, 10 మంది కుమార్తెలు సంతానం. ఇప్పుడు వారి సంఖ్య 2500కు చేరింది. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతలు గ్రామానికి క్యూ కడుతున్నారు.

Swami Smaranananda Maharaj No More: రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం.. కోల్‌ కతాలోని రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్ దవాఖానలో తుదిశ్వాస.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif